December 11, 2010

Acharya Deva!Yemantivi Yemantivi -DVS Karna

ఆచార్య దేవ! ఏమంటివి ఏమంటివి..
జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా..
హ..ఎంత మాట ఎంత మాటా..ఇది క్షాత్ర పరీక్ష కానీ క్ష్యత్రియ పరీక్ష కాదె..
కాదు.. కాకూడదు.. ఇది కుల పరీక్షయే అందువా..నీ తండ్రి భరద్వాజుని జననమేట్టిది.
అతి జుగుప్సాకరమైన నీ సంభవమేట్టిది ..మట్టి కుండలో పుట్టితివి కదా..నీది ఏ కులము?
ఇంత యేల..అస్మత్ పితామహుడు..కురుకుల వృద్దుడయిన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య అగు
గంగా గర్భమున జనియించలేదా..ఈయనదే కులము?
నాతో చెప్పింతువేమయ్యా..మా వంశమునకు మూల పురుషుడయిన వసిష్టుడు దేవ వేశ్య అగు ఊర్వసి పుత్రుడు కాడా.. ఆతడు పంచమజాతి  కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి ఛండాలాంగాన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబిక తో మా తండ్రిని, పిన పితాహమి అంబాలిక తో మా పిన తండ్రి పాండు రాజును, మా ఇంటి దాసీ తో ధర్మ నిర్మాణచనుడని మీ చె కీర్తించబడుచున్నఈ విదుర దేవుని కనలేదా..
సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమయిన మా కురు వంశము, ఏనాడో కులహీనమయినది. కాగా నేడు..కులము కులము అను వ్యర్ధ వాదమెందులకు..
---
నాయన సుయోధన..ఏరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కావు..
ఇది నీవన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే..క్షాత్రమున్నవారేల్లరు క్షత్రీయులే. వారిలో రాజ్యమున్నవారే రాజులు.
అట్టి రాజులే ఈ కురు రాజ పరిషత్తు లో పాల్గొనుటకు అర్హులు..
--
ఓహో..రాచరికమా అర్హతను నిర్ణయించునది..హ్మం..అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపదవిరామమయి వెలుగొందు అంగరాజ్యమునకు ఈతని మూర్దాభిషిక్తుని కావించుచున్నాను..