ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖి..
ఆనంద సుందర తాండవ కృష్ణం
చరణ నిక్వణిత నూపుర కృష్ణం
కరసంగత కనక కంకణ కృష్ణం
కింకిణి జాల ఘనఘణిత కృష్ణం
లోకశంకిత తారావళి మౌక్తిక కృష్ణం
సుందర నాసామౌక్తిక శోభిత కృష్ణం
నందనందనం అఖండ విభూతి కృష్ణం
కన్ఠోపకన్ఠ శోభి కౌస్తుభ కృష్ణం
కలికల్మష తిమిర భాస్కర కృష్ణం
గోవత్సబృంద పాలక కృష్ణం
కృత గోపికాజాల ఖేలన కృష్ణం
నందసునందాది వందిత కృష్ణం
శ్రీ నారాయణ తీర్త వరద కృష్ణం
____________________________________
సఖి..ఆ బాల కృష్ణుని ఆనంద సుందర రూపము గాంచు అంటూ వాణిజయరాం గారు శృతిలయలు సినిమా కోసం శ్రీ నారాయణ తీర్తులు రచించిన కృష్ణ లీలా తరంగిణిని పాడారు.చిన్నారి కృష్ణుని సుందర తాండవ రూపం కనుల ముందు మెదుల్తుంది ఈ పాట వింటుంటే.ఘల్లు మంటున్న కాలి మువ్వలు,కనక కంకణాలు ఆ చేతులకి,చెవులకి మెరిసే పచ్చలు,ముక్కున మెరిసే ఆ నవ మౌక్తికం,మెడలో కౌస్తుభం.కలి కల్మషాలు దూరం చేసే భాస్కరుడే కదా వివిధ రూపాలు దాల్చగల మన కృష్ణుడు.లేగదూడల బృందాలని కాస్తూ,అమాయకంగా గొల్లభామలతో ఆటలాడుతూ,నంద సునందాది మునులచే వందనాలు అందుకునే సుందర తాండవ కృష్ణుని రూపం గాంచటం అదృష్టమే కదా..
__________________________________
కస్తూరి తిలకం లలాట ఫలకే
వక్షస్తలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణుం కారే కంకణం
సర్వాంగే హరి చందనం చ కలయమ
కంటే చ ముక్తావళిం
గోపస్త్రి పరివేష్టితో విజయతే గోపాల చూడామణి..
___________________________________
ఘంటసాల గారు పాండురంగ మహత్యం చిత్రం కోసం జయ కృష్ణా ముకుందా మురారి అని పాడిన పాట లోని కస్తూరి తిలకం లలాట ఫలకే అనే శ్లోకం కూడా ఆ రూపాన్నేకంటికి కట్టినట్టు చూపిస్తుంది. శ్రీ లీలా సుఖర్ విరచించిన కృష్ణ కర్ణామృతం లోని ఈ శ్లోకం కూడా చాలా ఇష్టం నాకు.
భాషా బాధలు బాలముడతలు
-
ఈ మధ్య మనం పరభాష లో కాస్త ప్రావీణ్యం సంపాయించాం లే. అలా అని నాకు నేనె ఒక
బిరుదు కూడా తగిలించేస్కున్నాను.. స్పానిషారాధ అని!
క్లినిక్ కి మొన్న ఒక పెద్దాయ...
No comments:
Post a Comment