March 13, 2010

ee turupu..aa paschimam..padamati sandhya raagam

ఈ తురుపు..ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యా రాగాలెవో పారాణి పూచెను లె..

you ఆవకాయ్..మీ icecream
this is the heart and sweet lifes dream
united states of hearts we have
like indian namaste ..

ఆకాశంలో తార, సుడిగాలికారని దీపం
గుడి లేని దైవం కోసం వడి చేరుకున్నది లె
సాగరంలో కెరటం.. ఉప్పొంగిన నా హృదయం
అలిసేది కాదనురాగం..ఈ జన్మ సంగీతం
గ్రహణాలు లేని ఆ తారలన్ని గగనాన కలిసి ఈ వేళలోనే
కలిసింది ఈ బంధం..కలిసింది ఈ బంధం..
ఈ తురుపు..ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యా రాగాలెవో పారాణి పూచెను లె..

చైత్ర కోయిలలెన్నో మైత్రి వేణువులూదే
మనసైన మాటల కోసం మౌనాల ఆశలు పూచే
ఏడేడు రంగుల దీపం..ఆ నింగిలో హరి చాపం
అరుణాల రుధిరం తోనే రుణమైనది ప్రియబంధం
ఏ దేశమైనా ఆకాశమొకటే..ఏ జంటకైనా అనురాగమొకటే
అపురూపం ఈ ప్రణయం..అపురూపం ఈ ప్రణయం

ఈ తురుపు..ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యా రాగాలెవో పారాణి పూచెను లె..

No comments:

Post a Comment