skip to main |
skip to sidebar
అలిగితివా సఖి ప్రియా కలత మానవా..
ప్రియమారగ నీ దాసుని యేల జాలవా...
అలిగితివా సఖి ప్రియా ... కలత మానవా ..
లేని తగవు నటింతువా...
మనసు తెలియనెంచితివా..
ఈ పరీక్ష మాని ఇంక దయను చూడవా...
అలిగితివా ..
నీవే నాకు ప్రాణమని ..
నీ ఆనతి మీరనని ..
సత్యాపతి నా బిరుదని నింద ఎరుగవా ...
అలిగితివా ..
ప్రియురాలివి సరసనుండి
విరహమిటుల విదింతువా ... ఆ ఆ
భరియింపగా నా తరమా .. కనికరించావా ...
నను భవదీయ దాసుని మనంబున నీయపు కిన్కపూని తాచిన
అదినాకు మన్ననయ . చేల్వగు నీ పదపల్లవంబు మత్ తనుపులకాగ్ర
కంట కవితానము తాకిన నోచ్చునంచు నేననియద . అల్క మానవు గదా ఇకనైనా అరాళకుంతలా .. అరాళ కుంతలా ..
___________________________
ఆహా... ఈ పాట యెంత అద్భుతం కదా.NTR నటన,ఘంటసాల గాత్రం,పింగళి గారి సంగీతం. శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలో పాట ఇది.ఎన్నిసార్లు విని వుంటానో ఈ పాట.అసలు ఈ పాటలోని సున్నితత్వం గమనించారా.ఈ ప్రపంచాన్ని ఏలే ఆ శ్రీకృష్ణుడు సత్యభామతో అంటున్నాడు.,నీ ఈ దాసుని మీద అలిగి ఐనా సరే నన్ను మనసులో తలచటం నాకు మన్నన.కాని నీ సుకుమారమైన పాదము నా గట్టి తలని తాకి నోచ్చుకున్నదే.అయ్యో పాపం అని.కవి ఊహకి జోహారు!
భార్య గురించి ఇంతగా ఆరాట పడె భర్త దొరకటం అదృష్టం కదా.ఆలు మగల మద్య యెంత ప్రేమ వుంటే అలంటి తలపు వస్తుంది?అంటే భార్య నాకు సత్యభామ పూనింది అనగానే కాలి కింద తలకాయ పెట్టి రోజు తన్నించుకోమని నా ఉద్దేశం కాదులే.నా పిచ్చిగాని,ఈ కాలంలో ఇలాంటి సన్నివేసం కనపడటం కాస్త కష్టమే ;)
మొత్తానికి ఈ పాట చూసినప్పుడల్లా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది నాకు ...
శివ శoకరి...శివానందలహరి..శివశంకరి...
చంద్రకళాధరి ఈశ్వరి..
కరుణాంమ్రుతమును కురియజేయుమా
మనసు కరుగదా..మహిమ చూపవా
దీనపాలనము సేయవే...
శివశoకరి...
_______________________________________
ఈ పాట ఘంటసాల గారు "జగదేకవీరుని కధ"చిత్రం కోసం పాడారు.పెండ్యాలగారి సంగీతం,పింగళిగారి సాహిత్యం ఈ పాటని అద్వితీయంగా మలిచాయి.అసలే పాత సినిమాల్లో మనం NTR వీరాభిమాని.ఇహ ఈ పాటలో ఒకేసారి ఐదుగురు NTRలు కనిపిస్తే ఇంక చెప్పేదేముంది.అందుకోసమే పదేపదే ఈ పాటను చూసేదాన్ని చిన్నప్పుడు. శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేని నేను ఈ పాటలోని రాగాలు,స్వరాల గురించి మాట్లాడలేను కాని,ఆ స్వరాలూ,ఆ సంగీతం,ఆ గంధర్వుని గాత్రం కలిసిన సుధాసరితా త్రివేణి సంగమంలో ఎన్నిసార్లు మునిగి ధన్యమయ్యనో చెప్పలేను.ఒక్కో రాగం ఘంటసాలగారు ఆలపిస్తుంటే,స్వర్గపు మెట్లు ఎక్కుతున్నభావన.ఆ చివరి ఆలాపనకి ఇహ స్వర్గానికి చేరిపోయినట్టే వుంటుంది.ఆనందాతిసయ స్థితి.పాట విన్న ప్రతిసారి ఒక చిన్న కినుక.పాటతో సంతోష శిఖరాగ్రానికి తీసుకువెళ్ళి అక్కడే వదిలెయ్యకుండా,చివరిసారిగా "శివశంకరి" అని మళ్ళి భూమ్మీదకి తీసుకొస్తారు.సంగీత పరంగా అలాగే పాడాలేమోకాని నాకు ఆ తారస్తాయికి చేరాక అక్కడే విహరించటం ఇష్టం. ఏమన్నా అర్ధమయిందా..ఏమో :)
నాకు ఈ పాటంటే యెంత ఇష్టమో మాటల్లో వ్యక్తపరచలేను కాని చాలా చాలా ఇష్టం అని మాత్రం చెప్పగలను..
ఈ రేయి తీయనిది.. ఈ చిరుగాలి మనసైనది..
ఈ హాయి మాయనిది..ఇంతకు మించి ఏమున్నది...
ఏవేవో కోరికలు..యెదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు.. అల్లన దాగి వింటున్నవి..
పన్నీటి తలపులు నిండగా..ఇన్నాళ్ళ కలలే పండగా
చిన్నారి చెలియా..అపరంజి కలువ..
చేరాలి కౌగిట..జిలిబిలి నగవుల..
పరువాలు పల్లవి పాడగా..నయనాలు సయ్యటలాడగా
నిను చేరుకోగా నునుమేను తీగ
పులకించిపోఎను తొలకరి వలపుల..
ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
నిను నన్ను కలిపే.. నీ నీడ నిలిపే
అనురాగ సీమల అంచులు దొరికే..
________________________________
చాలా రోజులు ఈ పాట పూర్తిగా తెలీదు నాకు. ఒక రోజు ఈ టీ.వీ లో అనుకుంట,ఇదే శీర్షిక తో ఒక ప్రోగ్రాం వస్తుంటే విన్నాను. అప్పటినుండి ఈ రేయి తీయనిది,లలలలలలా అని ఓ..అరిగిపోయిన రికార్డు లాగా పాడుకుంటుంటే వినీ వినీ విసుగోచ్చిందేమో, నాన్నారు పిలిచి,ఒరేయ్ బుజ్జిగా,ఈ పాట మిగతా సగం ఇది రా."చిట్టి చెల్లెలు" సినిమా లో పాట ఇది,అంత నచ్చితే పూర్తిగా విని అప్పుడు పాడుకో అన్నారు.ఈ పాట కి ట్యూన్ కట్టింది సాలూరి వారు.కాకపొతే ఒక english album వుంది,"Love is Blue" ani,Andre Popp ది ఇదే బాణీ లో.మరి ఇది inspired song ఓ,inspiration ఇచ్చిన song ఓ నాకు తెలియదు.
పాట క్యాలిబర్ కి,మాంచి హీరో హీరోయిన్ కి situational song ఏమో అనుకున్న.తీరా చుస్తే ముసలాయన ఐపోయిన హరనాథ్ and అప్పుడే కెరీర్లో పైకి వస్తున్నా వాణిశ్రీ.ఇద్దరు main leads కాదట సినిమాలో.మరి ఇంతమంచి పాట వీళ్ళ మీద ఎందుకు తీసారో!(బుర్ర గోకింగ్స్ ).
ఏది ఏమైనా,మంచి పాట.బాలుగారు సుశీలమ్మ చాలా బాగా పాడారు..కదూ..