December 14, 2008

aligitiva sakhi

అలిగితివా సఖి ప్రియా కలత మానవా..
ప్రియమారగ  నీ  దాసుని యేల జాలవా...
అలిగితివా సఖి  ప్రియా ... కలత మానవా ..


లేని తగవు నటింతువా...
మనసు తెలియనెంచితివా..
ఈ  పరీక్ష  మాని  ఇంక  దయను  చూడవా...
అలిగితివా ..

నీవే  నాకు  ప్రాణమని  ..
నీ  ఆనతి  మీరనని ..
సత్యాపతి  నా  బిరుదని  నింద  ఎరుగవా ...
అలిగితివా ..

ప్రియురాలివి  సరసనుండి
విరహమిటుల  విదింతువా ... ఆ  ఆ
భరియింపగా  నా  తరమా .. కనికరించావా ...

నను భవదీయ దాసుని మనంబున నీయపు కిన్కపూని తాచిన
అదినాకు మన్ననయ . చేల్వగు నీ పదపల్లవంబు మత్ తనుపులకాగ్ర
కంట కవితానము తాకిన నోచ్చునంచు నేననియద . అల్క మానవు   గదా ఇకనైనా అరాళకుంతలా .. అరాళ కుంతలా ..
___________________________
ఆహా... ఈ పాట యెంత అద్భుతం కదా.NTR నటన,ఘంటసాల గాత్రం,పింగళి గారి సంగీతం. శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలో పాట ఇది.ఎన్నిసార్లు విని వుంటానో ఈ పాట.అసలు ఈ పాటలోని సున్నితత్వం గమనించారా.ఈ ప్రపంచాన్ని ఏలే ఆ శ్రీకృష్ణుడు సత్యభామతో అంటున్నాడు.,నీ ఈ దాసుని మీద అలిగి ఐనా సరే నన్ను మనసులో తలచటం నాకు మన్నన.కాని నీ సుకుమారమైన పాదము నా గట్టి తలని  తాకి నోచ్చుకున్నదే.అయ్యో పాపం అని.కవి ఊహకి జోహారు!
భార్య గురించి ఇంతగా ఆరాట పడె భర్త దొరకటం అదృష్టం కదా.ఆలు మగల మద్య యెంత ప్రేమ వుంటే అలంటి తలపు వస్తుంది?అంటే భార్య
నాకు సత్యభామ పూనింది అనగానే కాలి కింద తలకాయ పెట్టి రోజు తన్నించుకోమని నా ఉద్దేశం కాదులే.నా పిచ్చిగాని,ఈ  కాలంలో ఇలాంటి సన్నివేసం కనపడటం కాస్త కష్టమే ;)
మొత్తానికి ఈ పాట చూసినప్పుడల్లా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది నాకు
...

No comments:

Post a Comment