December 14, 2008

ee reyi teeyanidi

ఈ రేయి తీయనిది.. ఈ చిరుగాలి మనసైనది..
ఈ హాయి మాయనిది..ఇంతకు మించి ఏమున్నది...

ఏవేవో కోరికలు..యెదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు.. అల్లన దాగి వింటున్నవి..


పన్నీటి తలపులు నిండగా..ఇన్నాళ్ళ కలలే పండగా
చిన్నారి చెలియా..అపరంజి కలువ..
చేరాలి కౌగిట..జిలిబిలి నగవుల..

పరువాలు పల్లవి పాడగా..నయనాలు సయ్యటలాడగా
నిను చేరుకోగా నునుమేను తీగ
పులకించిపోఎను తొలకరి వలపుల..

ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
నిను నన్ను కలిపే.. నీ నీడ నిలిపే
అనురాగ సీమల అంచులు దొరికే..
________________________________
చాలా రోజులు ఈ పాట పూర్తిగా తెలీదు నాకు. ఒక రోజు ఈ టీ.వీ లో అనుకుంట,ఇదే శీర్షిక తో ఒక ప్రోగ్రాం వస్తుంటే విన్నాను. అప్పటినుండి ఈ రేయి తీయనిది,లలలలలలా అని ఓ..అరిగిపోయిన రికార్డు లాగా పాడుకుంటుంటే వినీ వినీ విసుగోచ్చిందేమో, నాన్నారు పిలిచి,ఒరేయ్ బుజ్జిగా,ఈ పాట మిగతా సగం ఇది రా."చిట్టి చెల్లెలు" సినిమా లో పాట ఇది,అంత నచ్చితే పూర్తిగా విని  అప్పుడు పాడుకో అన్నారు.ఈ పాట కి ట్యూన్ కట్టింది సాలూరి వారు.కాకపొతే ఒక english album వుంది,"Love is Blue" ani,Andre Popp ది ఇదే బాణీ లో.మరి ఇది inspired song ఓ,inspiration ఇచ్చిన song ఓ నాకు తెలియదు.

పా క్యాలిబర్ కి,మాంచి హీరో హీరోయిన్ కి situational song ఏమో అనుకున్న.తీరా చుస్తే ముసలాయన  ఐపోయిన హరనాథ్ and అప్పుడే కెరీర్లో పైకి వస్తున్నా వాణిశ్రీ.ఇద్దరు main leads కాదట సినిమాలో.మరి ఇంతమంచి పాట వీళ్ళ మీద  ఎందుకు తీసారో!(బుర్ర  గోకింగ్స్ ).
ఏది ఏమైనా,మంచి  పాట.బాలుగారు సుశీలమ్మ చాలా బాగా పాడారు..కదూ..

No comments:

Post a Comment