December 14, 2008

siva sankari..sivananda lahari

శివ శoకరి...శివానందలహరి..శివశంకరి...
చంద్రకళాధరి ఈశ్వరి..
కరుణాంమ్రుతమును  కురియజేయుమా
మనసు కరుగదా..మహిమ చూపవా
దీనపాలనము సేయవే...
శివశoకరి...

_______________________________________
ఈ పాట ఘంటసాల గారు "జగదేకవీరుని కధ"చిత్రం కోసం పాడారు.పెండ్యాలగారి సంగీతం,పింగళిగారి సాహిత్యం ఈ పాటని అద్వితీయంగా మలిచాయి.అసలే పాత సినిమాల్లో మనం NTR వీరాభిమాని.ఇహ ఈ పాటలో ఒకేసారి ఐదుగురు NTRలు కనిపిస్తే ఇంక చెప్పేదేముంది.అందుకోసమే పదేపదే ఈ పాటను చూసేదాన్ని చిన్నప్పుడు. శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేని నేను ఈ పాటలోని రాగాలు,స్వరాల గురించి మాట్లాడలేను కాని,ఆ స్వరాలూ,ఆ సంగీతం,ఆ గంధర్వుని గాత్రం కలిసిన సుధాసరితా త్రివేణి సంగమంలో ఎన్నిసార్లు మునిగి ధన్యమయ్యనో  చెప్పలేను.ఒక్కో రాగం ఘంటసాలగారు ఆలపిస్తుంటే,స్వర్గపు మెట్లు ఎక్కుతున్నభావన.ఆ చివరి ఆలాపనకి ఇహ స్వర్గానికి చేరిపోయినట్టే వుంటుంది.ఆనందాతిసయ స్థితి.పాట విన్న ప్రతిసారి ఒక చిన్న కినుక.పాటతో  సంతోష శిఖరాగ్రానికి తీసుకువెళ్ళి అక్కడే వదిలెయ్యకుండా,చివరిసారిగా "శివశంకరి" అని మళ్ళి భూమ్మీదకి  తీసుకొస్తారు.సంగీత పరంగా అలాగే పాడాలేమోకాని నాకు ఆ తారస్తాయికి చేరాక అక్కడే విహరించటం ఇష్టం. ఏమన్నా అర్ధమయిందా..ఏమో  :)
నాకు ఈ పాటంటే యెంత ఇష్టమో మాటల్లో వ్యక్తపరచలేను కాని చాలా  చాలా ఇష్టం అని మాత్రం చెప్పగలను..

No comments:

Post a Comment