March 15, 2010

Neelaalu kaarena kaalaalu maarena- MuddaMandaaram

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా.. నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళా..
పూల డోల నేను కానా..

సూరీడు నెలరేడు సిరిగల దొరలే కారులె
పూరీ గుడిసెల్లో పేద మనస్సులో వెలిగేటి దీపాలు లె
ఆ నింగి ఈ నెల కొనగల సిరులే లేవు లె
కలిమి లేముల్లో కరిగే ప్రేమల్లో నిరుపేద లోగిళ్ళు లె

ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో
కలికి వెన్నెల్లో కలలా కన్నుల్లో కల పారిపోవాలి లె
ఆ తారలే తేరి తళతళ మెరిసే రేయిలో
ఒడిలో నీవుంటే ఒదిగి పోతుంటే
కడతేరిపోవాలి లె..
___________________________________
కొద్ది కాలం క్రితం అనుకోకుండా ఈ పాట తారసపడింది నాకు. మొదటి సారి వినగానే ఎందుకో ఎక్కడో మది గది లో తాళం వేసిపెట్టిన భావోద్వేగాలు కన్నీటి రూపంలో ధారలై కారి బయటకి వచ్చాయి. అసలు ఎందుకు ఈ పాట నా మదిని అంతగా ఆకర్షించిందో ఇప్పటికీ అర్ధం కాదు..కానీ వింటున్నకొద్ది ఇంకా ఇంకా..ఏదో తెలియని బాధా..కాదా..ఏదా ఇది అని అర్ధం కాదె!
నేను పోయినసారి నాలుగు రోజులు ఆపకుండా పగలు రేయి తేడా లేకుండా ఈ పాట వినేసాను..ఐనా తనివి తీరలేదు. ఈ పాట వినటం మొదలుపెడితే, మళ్ళి వారం పాటు అగ్న్యతవాసం లోకి వేల్లిపోతనేమో అని భయపడి..ఈ మద్య అతిగా వినటం మానేసాను.ఎంతో సున్నితమైన గొంతుతో బాలు గారు ఈ పాట పాడి, తానూ కాక మరెవరు ఇలా పాడలేరు అనిపించుకున్నారు.
నా మనసుకి బంధువైపోయి నన్ను బంధించిన ఈ పాట అంటే నాకు చాలా అభిమానం..
పద దాత వేటూరి గారు..సంగీత ప్రదాత రమేష్ నాయుడు గారు ధన్యులు..

No comments:

Post a Comment